Share News

మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణ స్వీకారం..

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:28 PM

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్ చేత.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు.

మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణ స్వీకారం..

ఇంఫాల్, ఫిబ్రవరి 04: మణిపూర్ ముఖ్యమంత్రిగా యుమునాం ఖేమ్‌చంద్ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్ సింగ్ చేత.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే నెమ్చా కిప్‌జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది మణిపూర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను ఇవాళ(ఫిబ్రవరి 04న) ఎత్తివేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రిగా యుమునాం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఖేమ్‌చంద్ సింగ్‌ను ఎమ్మెల్యేలు మంగళవారం నాడు ఎన్నుకున్నారు.


2023లో మే మాసంలో జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడికింది. దాంతో 250 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది రాష్ట్రం విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిపోయారు. ఆ తర్వాత అంటే.. ఈ ఘర్షణలు చోటుచేసుకున్న దాదాపు తొమ్మిది నెలల అనంతరం బీరెన్ సింగ్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఇంకోవైపు ప్రస్తుత సీఎం ఖేమ్‌చంద్ సింగ్‌.. 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత బీరెన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని మైతేయిలు, కుకీలు, నాగాలతో ఖేమ్‌చంద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 08:15 PM