Share News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:41 PM

ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..
JeM Terrorists

ఉదంపూర్: జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‌కౌంటర్‌లో పాక్‌కు చెందిన ఇద్దరు జైషే మమ్మద్ (JeM) ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకరిని ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా చురుకుగా పనిచేస్తున్న 'జైషే' టాప్ కమాండర్ అవు మావియాగా, మరొకరిని జబ్బర్ అనే ఉగ్రవాదిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. 'కియా' పేరుతో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టగా, ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.


అధికారుల సమాచారం ప్రకారం, జైషేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మిలిటెంట్లు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. నిఘా డ్రోన్ వారిని ఒక గుహలో దాక్కుకున్నట్టు గుర్తించడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.


గుహ మొదట్లో ఒక ఉగ్రవాది, గుహలోపల మరొక ఉగ్రవాది మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వారి నుంచి ఒక ఎం-4 కార్బైన్, ఒక ఏకే-47 రైఫిల్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు

Updated Date - Feb 04 , 2026 | 04:20 PM