Home » Mulugu
Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ వృద్ధురాలి పూరి గుడిసెను సమీప బంధువు దహనం చేసిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం జరిగింది.
ములుగు జిల్లా తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లంకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు, మంత్రి సీతక్క అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
Tribal Protests: ములుగు జిల్లాలో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గడిసెలు తొలగించేందుకు యత్నించిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్‌కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ములుగులో 8 మంది మావోయిస్టు సభ్యులు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట శనివారం లొంగిపోయారు.
రాష్ట్రంలోని ఓ మండలానికి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పేరు పెట్టింది. ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పడిన మల్లంపల్లి మండలం పేరును జేడీ మల్లంపల్లిగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసింది.
Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.
Minister Seethakka: వన్యప్రాణులకు ప్రమాదమని రహదారులు వేయనీయకపోతే ఎలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడవచ్చని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.