Share News

SHOCKING: పెళ్లయిన 13 రోజులకే గర్భం దాల్చిన యువతి

ABN , Publish Date - Oct 12 , 2025 | 02:10 PM

ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని నమ్మబలికి యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేసేందుకు కుట్ర పన్నాడు. ఎలాగైనా ఆ యువతిపై తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బాధితురాలిని పవన్ కళ్యాణ్ బెదిరించాడు. వీరిద్దరి విషయం బయటికి చెబుతానని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

SHOCKING: పెళ్లయిన 13 రోజులకే గర్భం దాల్చిన యువతి
Attack on Women

సిద్ధిపేట, అక్టోబర్ 12: సిద్ధిపేట జిల్లా ములుగు గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. పెళ్లయిన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. సదరు బాధితురాలిని ఓ అబ్బాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని నమ్మబలికి యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేసేందుకు కుట్ర పన్నాడు. ఎలాగైనా ఆ యువతిపై తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బాధితురాలిని పవన్ కళ్యాణ్ బెదిరించాడు. వీరిద్దరి విషయం బయటికి చెబుతానని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. ఇలా ప్రేమ పేరుతో ఒకడు, భయపెట్టి మరొకడు పలుమార్లు యువతిపై అత్యాచారం చేశారు.


ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు కూడా మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చి వివాహం చేశారు. జరిగిన విషయం దాచిపెట్టి గత నెలలో మరో అబ్బాయితో యువతి పెళ్లి చేశారు. ఈ నెల 8న యువతికి తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆమెని భర్త ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. వైద్యులు పరీక్షించి ఆ యువతి గర్భవతి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై కోపంతో రగిలిపోయిన భర్త.. ఆమెను నిలదీశాడు. దీంతో జరిగిన విషయం అంతా బాధితురాలు తన భర్తకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Prisoner Attempts Suicide: జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగిన ఖైదీ.. చికిత్స పొందుతూ..

Panjagutta Road Accident: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

Updated Date - Oct 12 , 2025 | 02:10 PM