Share News

Panjagutta Road Accident: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:45 AM

స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Panjagutta Road Accident: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

హైదరాబాద్: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢికొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత మృతదేహాలను వారి కుంటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు తెలిపారు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అలాగే కారు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీసులు వెల్లడించారు. రోడ్డు భద్రత వాహనదారులు సహకరించాలని కోరారు.


ఇవి కూడా చదవండి..

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Updated Date - Oct 12 , 2025 | 11:45 AM