Prisoner Attempts Suicide: జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగిన ఖైదీ.. చికిత్స పొందుతూ..
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:24 PM
జనగామ జిల్లా సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్‌లోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి సబ్ జైలు ముందు ఆందోళన చేపట్టారు.
జనగామ, అక్టోబర్ 12: జనగామ జిల్లా సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్ లోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి సబ్ జైలు ముందు ఆందోళన చేపట్టారు. సబ్ జైలు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అటు జనగామ జిల్లాలో మరో ఘటన జరిగింది. అంబులెన్స్ రాక ఆటోలోనే గర్భిణీ ప్రసవించింది. లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో ఈ ఘటన జరిగింది. కనకలక్ష్మి అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు ఆలస్యం కావడంతో.. ఆమెని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. నెల్లుట్ల వద్ద నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ఆశా వర్కర్లకి ఆటోడ్రైవర్ ఫోన్‌లో సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆశా వర్కర్లు అరుణ, పుష్ప, ఉమ ఆటో ఆపేసి గర్భిణికి పురుడుపోశారు. గర్భిణీ కనకలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి, కొడుకును ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
Viral Video: చటుక్కున ఫోన్ లాగేసుకున్న RPF సిబ్బంది.. ఏమైందంటే?
Trump Invite Modi: కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!