Share News

Viral Video: చటుక్కున ఫోన్ లాగేసుకున్న రైల్వే పోలీస్.. ఏమైందంటే?

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:45 PM

రైల్లో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్న ఓ మహిళ ఫోన్‌ను చటుక్కున లాగేసుకొని ఓ రైల్వే పోలీసు ప్రాంక్ చేశారు. దొంగలు ఇలా ఫోన్‌ను లాక్కొని పారిపోయే అవకాశం ఉందని ప్రాక్టికల్ చేసి చూపించారు. ఒక్కసారిగా తన ఫోన్‌ను లాగేసుకునేసరికి సదరు మహిళ షాక్‌కు గురయ్యారు. ఫోన్ లాక్కుంది పోలీసేనని గ్రహించి ఒక నవ్వు నవ్వారు. 'హమ్మయ్య నా ఫోన్ సేఫ్' అని భావించి తన ఫోన్‌ని తిరిగి తీసుకున్నారు.

Viral Video: చటుక్కున ఫోన్ లాగేసుకున్న రైల్వే పోలీస్.. ఏమైందంటే?
Viral Video

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: సాధారణంగా రైల్వే ప్రయాణం అంటేనే చాలా ఇబ్బంది పడుతాం. ఇక అందులో జనరల్ భోగి అయితే ఆ కష్టాలు చెప్పనక్కర్లేదు. రైల్వే ప్రయాణం ఎప్పుడు చేసినా కిటికీ సీటు పక్కన కూర్చోవాలని కోరుకుంటాం. ట్రైన్‌లో ఉండే ఆ హడావిడికి తట్టుకోలేక, చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటాం. మన పనిలో మనం ఉంటే దొంగలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడ? ఎలా? చాకచక్యంగా దొంగతనం చేయాలా? అని ఆలోచిస్తుంటారు. ట్రైన్ కదులుతున్న సమయంలో చట్టుక్కున డబ్బులు, వస్తువులు లాగేసుకొని పారిపోతుంటారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ, దొంగతనాలు మాత్రం తగ్గడం లేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ప్రయాణికులు దొంగల పట్ల అవగాహన కలిగి ఉండాలని వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా దొంగలపై అప్రమత్తంగా ఉండాలని ఓ రైల్వే పోలీస్ వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.


రైల్లో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తున్న ఓ మహిళ ఫోన్‌ను చటుక్కున లాగేసుకొని ఓ రైల్వే పోలీసు ప్రాంక్ చేశారు. దొంగలు ఇలా ఫోన్‌ను లాక్కొని పారిపోయే అవకాశం ఉందని ప్రాక్టికల్ చేసి చూపించారు. ఒక్కసారిగా తన ఫోన్‌ను లాగేసుకునేసరికి సదరు మహిళ షాక్‌కు గురయ్యారు. ఫోన్ లాక్కుంది పోలీసేనని గ్రహించి ఒక నవ్వు నవ్వారు. 'హమ్మయ్య నా ఫోన్ సేఫ్' అని భావించి తన ఫోన్‌ని తిరిగి తీసుకున్నారు. పోలీసులు ఇలా అవగాహన కల్పించడం పట్ల అక్కడివారంతా అతడిని మెచ్చుకున్నారు. తమ విధులను నిర్వర్తించడమే కాకుండా.. ప్రాక్టికల్‌గా అప్రమత్తం చేయడం రియల్లీ గ్రేట్ అంటూ కొనియాడారు. ఈ వీడియో ఇన్‌స్టా‌గ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా.. వైరల్ అవుతోంది. పోలీసులు ఇలా చేసి అప్రమత్తం చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Trump Invite Modi: కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Updated Date - Oct 12 , 2025 | 03:46 PM