Home » MLC Elections
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
‘ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ-విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి...
తనను గెలిపిస్తే ఆరు నెల ల్లో మహిళా ఉపాధ్యాయులందరికీ ఎలక్ట్రిక్ బైక్‌లు అందజేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి హామీ ఇస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి’ అని మంత్రి నారా లోకేశ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వాస్తవాలకు దూరంగా ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత పొందారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలోని 5, ఆంధ్రప్రదేశ్‌లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్టు సోమవారం వెల్లడించింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పీఆర్‌టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు-బీసీ వాదానికి మధ్య పోరుగా మారాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది ఉన్నా ప్రధాన పోటీ ఐదారుగురి మధ్యే ఉంది.
రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు.