నన్ను గెలిపించండి! మహిళా టీచర్లకు ఎలక్ర్టిక్ బైక్‌లు ఇస్తా
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:13 AM
తనను గెలిపిస్తే ఆరు నెల ల్లో మహిళా ఉపాధ్యాయులందరికీ ఎలక్ట్రిక్ బైక్‌లు అందజేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి హామీ ఇస్తున్నారు.

బాండ్ రాసి ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తనను గెలిపిస్తే ఆరు నెల ల్లో మహిళా ఉపాధ్యాయులందరికీ ఎలక్ట్రిక్ బైక్‌లు అందజేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఓటర్లకు ఆయన ఈమేరకు బాండ్ పేపర్ రాసి ఇస్తున్నారు. మెదక్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన బాండ్ పేపర్‌ను ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే వారి గొంతుకగా మారతానని హామీ ఇచ్చారు.