Home » Minister Seethakka
Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.
ములుగు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తితో నిధులు మంజూరయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. మే నెలలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేసింది.
Seethakka Comments: మాజీ మంత్రి కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఏదో ఆశించి కేటీఆర్ జైలుకు పోవాలని అనుకుంటున్నారని అన్నారు.
Minister Seethakka: మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామని వెల్లడించారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామనన్నారు.
Minister Seethakka: వన్యప్రాణులకు ప్రమాదమని రహదారులు వేయనీయకపోతే ఎలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడవచ్చని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
నాగారం భూదాన్ భూకుంభకోణం కేసులో ఈడీ వేసిన కేసును కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఉపశమనం కల్పించలేమని పేర్కొంటూ, ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.
మాజీ మంత్రి హరీష్‌రావు రాసిన లేఖపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. పదేళ్ల పాలనలో అంగన్‌వాడీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికీ తెలంగాణ సెంటిమెంటును రుద్దకండంటూ హెచ్చరించారు.