Home » Minister Nara Lokesh
వినాయక చవితి సందర్భంగా భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నందమూరి బాలకృష్ణకు స్థానం దక్కడంతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య మామయ్యకు అభినందనలు అని లోకేష్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ ఉద్ఘాటించారు. సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలేనని తెలిపారు. మెరుగైన ఫలితాలపై దృష్టిసారించాల్సిన బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులపై ఉందని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించటం ఓ చారిత్రాత్మక క్షణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి విలువైన సేవలు అందించిన పారిశ్రామిక వేత్త రతన్ టాటాను గౌరవించుకోవాలనే ఏపీ ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
పాఠశాలల్లో ఏం జరుగుతుందన్న అంశాలను అధ్యయనం చేసేందుకు మంత్రి లోకేశ్ సోషల్ ఆడిట్' పేరుతో సమగ్ర విషయ సేక రణ నిర్వహించాలని ఆదేశించగా, కొద్దిరోజు లుగా ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతోంది.