Share News

Nara Lokesh: పిల్లలకు అర్థమయ్యేలా పుస్తక రూపంలో బాలల భారత రాజ్యాంగం: లోకేష్

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:05 PM

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.

Nara Lokesh: పిల్లలకు అర్థమయ్యేలా పుస్తక రూపంలో బాలల భారత రాజ్యాంగం: లోకేష్
Nara Lokesh

అమరావతి, నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ డ్రిల్ అనంతరం మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) మాట్లాడుతూ.. విద్యార్థులతో మాక్ అసెంబ్లీని మెయిన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాలని అకున్నామని తెలిపారు. అయితే రూల్స్ పర్మిట్ చేయవని స్పీకర్ చెప్పడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం నిర్వహిద్దామని అన్నట్లు చెప్పారు. ఈ మాక్ అసెంబ్లీ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని.. అందుకే పిల్లలకు అర్ధం అయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తెచ్చామని అన్నారు. రాజ్యాంగం భారత దేశపు ఆత్మ అని.. అందుకే మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలామ్ అజాద్ వంటి వారి గురించి ఈ పుస్తకంలో ఉంచామని వెల్లడించారు.


పిల్లల సక్సెస్‌లో తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందన్నారు. నైతిక విలువలపై చాగంటి కోటేశ్వరరావు చెప్పినది ఎంతో మంచి మాటన్నారు. చేసిన పనిని ధైర్యంగా తల్లికి చెప్పగలిగితే అందరూ మంచి పౌరులుగా మారుతారని చాగంటి అన్నారని.. ఇదే విషయం ముఖ్యమంత్రికి కూడా తాను చెప్పినట్లు తెలిపారు. చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి సలహదారుగా నియమిస్తే.. ఒక్క రూపాయి కూడా వద్దని ప్రభుత్వ బాధ్యతను తన డబ్బులతోనే నిర్వహిస్తామని ఆయన చెప్పారని తెలిపారు. పిల్లల కోసమే ప్రతి ఒక్కరం కష్టపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నామని... చాలా వరకూ సాధించామన్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.


‘క్రమశిక్షణ పట్టుదల నాలో ఉందంటే నా తల్లి భువనేశ్వరినే కారణం.. మిమ్మల్ని మీ తల్లి దండించిందో లేదో తెలియదు. నేను తప్పు చేస్తే నా తల్లి దండించింది... చిన్న తప్పు మాట్లాడితే వెంటనే మెసేజ్ చేస్తుంది’ అని తెలిపారు. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడుస్తావా అంటూ మహిళలను కించపరిచే మాటలు ఎవ్వరూ వాడొద్దన్నారు. పుస్తకాల్లో ఉంటే చాలదని.. అమలులో ఉండాలని మంత్రి అన్నారు.


45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ లైవ్‌ను విద్యార్ధులు చూస్తున్నారని తెలిపారు. చర్చ వాస్తవాలతో జరగాలని... గొడవలతో కాదన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాజ్యంగం కాపీని చేతపట్టి పాదయాత్ర చేసినట్లు తెలిపారు. తన హక్కుల గురించి పోలీసులను అడిగితే తెలియదంటూ సమాధానం చెప్పారని.. ఎస్పీని అడగమన్నారని గుర్తుచేశారు. చిన్నతనం నుంచి రాజ్యంగం గురించి ప్రతి ఒక్కిరికి తెలిసేలా చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా రాష్ట్రాన్ని, దేశాన్ని గర్వపడేలా చేయాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు

భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 04:51 PM