AP Mock Assembly: ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు
ABN , Publish Date - Nov 26 , 2025 | 09:40 AM
ఏపీ మాక్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు.
అమరావతి, నవంబర్ 26: అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు తెర తీసింది. అందుకు కోసం మాక్ అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాక్ అసెంబ్లీని (AP Mock Assembly) నిర్వహిస్తున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్నీ తామై నడిపిస్తున్నారు.
ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్ (Minister Lokesh) తదితరులు హాజరయ్యారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
మాక్ అసెంబ్లీ మినీ టు మినిట్ ప్రోగ్రాం..
ఉదయం 9:30 గంటల నుంచి 9:35 గంటలకు సభకు ప్రొటెం స్పీకర్ ఆగమనం
9:35 గంటల నుంచి 9: 40 గంటల వరకు స్పీకర్ ఎంపిక
సభలోకి స్పీకర్ ప్రవేశం
స్పీకర్‌ను ఎస్కార్ట్ చేయనున్న ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలుగా విద్యార్థి ప్రతినిధులు
స్పీకర్, ఆయా పార్టీల నాయకుల ప్రారంభ వ్యాఖ్యలు, స్పీకర్‌కు అభినందనలు
9 గంటల 45 నిమిషాల నుంచి 35 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు
10:20 గంటల నుంచి 15 నిమిషాల పాటు జీరో అవర్
10:35 గంటల నుంచి 20 నిమిషాల పాటు శాసనసభ బిజినెస్
దీనిలో భాగంగా సోషల్ మీడియా యూస్ బిల్, పర్యావరణ పరిరక్షణ బిల్లులు సభ ముందుకు
10 గంటల 55 నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు సభాపతి ముగింపు వ్యాఖ్యలు
ఉదయం 11 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోకు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర ముఖ్య నేతలు నివాళులు
11 గంటల ఐదు నిమిషాలకు చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ రాజ్యాంగం పరిపాలన విలువలపై ప్రసంగం
11 గంటల పది నిమిషాలకు మానవనురుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పీచ్
11:20 నిమిషాలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సందేశం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చర్చలపై ప్రసంగం
11:30 కి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఉపన్యాసం
రాజ్యాంగ విలువలు, పౌరుల బాధ్యతలు, యువతకు విజన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం
12 గంటలకు చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ ప్రతి పుస్తకాన్ని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
12 గంటల పది నిమిషాలకు రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ ప్రతిజ్ఞ
12 గంటల 15 నిమిషాలకు విద్యార్థులతో నాయకుల ఫోటోగ్రఫి సెషన్
12 గంటల 30 నిమిషాలకు అసెంబ్లీ భవనాలను విద్యార్థులకు చూపించనున్న సిబ్బంది
ఇవి కూడా చదవండి...
వైసీపీకి బిగ్ షాక్.. కొండారెడ్డి కేసులో మరో కీలక పరిణామం
బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్
Read Latest AP News And Telugu News