Home » Manda Krishna Madiga
రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగలు, అందులోని ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో అన్నారు.
దళితుల్లో ఇప్పటి వరకు వివిధ కులాల రిజర్వేషన్లు దోచుకున్న వారి లైసెన్స్ రద్దు అయ్యిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి జేఏసీ ఆధ్వర్యంలో తమ సామాజిక వర్గాన్ని గ్రూపు-1లో పెట్టాలనే అంశంపై ఆయన మాట్లాడారు.
వృత్తిపరంగా మాంగ్, మాదిగలు ఒక్కటైనప్పటికీ.. మాంగ్‌లను వేరే గ్రూప్‌లో ఎందుకు వేశారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
నిండు అసెంబ్లీలో కేసీఆర్(KCR) ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే, 40 నిమి షాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించా రన్నారని, ఎన్నో ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోదీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
ఎస్సీ వర్గీకరణ జరిగిందన్న ఆనందం కన్నా మంద కృష్ణలో ఆందోళన ఎక్కువయిందని మాదిగ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ అన్నారు.
స్సీ వర్గీకరణ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. ఆ కారణంగానే ఏకసభ్య కమిషన్ చేసిన సిఫారసుల్లో మాదిగలకు దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ రాలేదని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో సభలు, సమావేశాలు, ఆందోళనలు, చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహించామని, ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
Manda Krishna Madiga: కాంగ్రెస్ పార్టీలో శాసించే స్థాయిలో మాలలు ఉండబట్టే సుప్రీంకోర్టు తీర్పు అమలు కావడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేస్తామని తీర్మానం చేశారని తెలిపారు.
రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకుంటోంది వివే క్ వెంకటస్వామితో పాటు మరికొందరు మాల నాయకులేనని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
గత ప్రభుత్వంలో కేంద్రం ప్రకటించే పద్మ అవార్డులు ఉన్నత వర్గాలకే వచ్చేవని, ప్రధాని మోదీ వచ్చాకే ఈ పదేళ్లలో ఎందరో పేదలకు ఆయా రంగాల్లో వారి కృషికి గుర్తింపుగా పద్మ అవార్డులు వస్తున్నాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.