Mandakrishna Madiga: కేసీఆర్ ఉద్యమాన్ని అవమానిస్తే.. రేవంత్‌రెడ్డి అవహేళన చేశారు..
ABN , Publish Date - Feb 08 , 2025 | 10:50 AM
నిండు అసెంబ్లీలో కేసీఆర్(KCR) ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే, 40 నిమి షాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించా రన్నారని, ఎన్నో ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోదీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

- ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: నిండు అసెంబ్లీలో కేసీఆర్(KCR) ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని అణగ తొక్కుతా అని అవమానిస్తే, 40 నిమి షాల ప్రసంగంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎమ్మార్పీఎస్ పేరు తీయకుండా అవమానించా రన్నారని, ఎన్నో ఏళ్లుగా సమాజానికి దూరంగా ఉన్న తనను నరేంద్ర మోదీ గుర్తించి గుండెలకు హత్తుకుని హృదయంలో పెట్టుకున్నారన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ(Mandakrishna Madiga) అన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తన 30 ఏళ్ల పోరాటంలో ప్రతి చోటా తనతో పాటే నడిచిందన్నారు. తన 30 ఏళ్ల పోరాటంలో జాతి కోసం కొన్ని రోజులు కష్టపడితే సమాజంలో జరిగే అనేక కష్టనష్టాలపై పోరాటం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉందని మందకృష్ణ మాదిగ అన్నారు.
సమాజంలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన తమ ఉద్యమాన్ని గుర్తించి గుండెలకు హత్తుకున్న నరేంద్ర మోదీని, ఉద్యమానికి అడుగడుగున బాసటగా నిలిచిన సమాజానికి తాను రుణపడి ఉంటానని అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బి.వెంకటేష్ నేత, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, వివిధ సంఘాల నాయకులు సాయి కృష్ణ, సుధాకర్ గండే, పిట్ట శ్రీనివాస్ రెడ్డి,పెద్దాపురం నరసింహ, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, దాసన్న తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News