Share News

Manda Krishna: ఉమ్మడి రిజర్వేషన్ల లైసెన్స్‌ రద్దు అయ్యింది

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:27 AM

దళితుల్లో ఇప్పటి వరకు వివిధ కులాల రిజర్వేషన్లు దోచుకున్న వారి లైసెన్స్‌ రద్దు అయ్యిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి జేఏసీ ఆధ్వర్యంలో తమ సామాజిక వర్గాన్ని గ్రూపు-1లో పెట్టాలనే అంశంపై ఆయన మాట్లాడారు.

Manda Krishna: ఉమ్మడి రిజర్వేషన్ల లైసెన్స్‌ రద్దు అయ్యింది

  • అభివృద్ధి చెందిన మాల సామాజికవర్గాన్ని డి గ్రూపులో పెట్టాలి: మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్‌, పంజాగుట్ట, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): దళితుల్లో ఇప్పటి వరకు వివిధ కులాల రిజర్వేషన్లు దోచుకున్న వారి లైసెన్స్‌ రద్దు అయ్యిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హోలియదాసరి జేఏసీ ఆధ్వర్యంలో తమ సామాజిక వర్గాన్ని గ్రూపు-1లో పెట్టాలనే అంశంపై ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందిన మాల సామాజికవర్గాన్ని డి గ్రూపులో పెట్టాలని డిమాండ్‌ చేయాలని చెప్పారు. అత్యంత వెనుకబడిన హోలియదాసరి కులంతో పాటు మరికొన్ని కులాలను ఒకే గ్రూపులో పెట్టి వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని సూచించారు.


సమయం ఇవ్వండి.. వచ్చి కలుస్తా.. ముఖ్యమంత్రికి లేఖ

ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ సమర్పించిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలతో పాటు మరికొన్ని దళిత కులాల హక్కులు, వాటా, అస్థిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. వాటిపై చర్చించి తగిన సలహాలు, సూచనలు చేయడానికి తనకు సీఎం రేవంత్‌ సమయం ఇవ్వాలని మందకృష్ణ మాదిగ సోమవారం ఆయనకు లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 05:27 AM