Manda Krishna: మాంగ్‌లను గ్రూప్-బీలో చేర్చాలి
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:45 AM
వృత్తిపరంగా మాంగ్, మాదిగలు ఒక్కటైనప్పటికీ.. మాంగ్‌లను వేరే గ్రూప్‌లో ఎందుకు వేశారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

వర్గీకరణ లోపాలను సవరించాలి: మందకృష్ణ
బర్కత్‌పుర, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): వృత్తిపరంగా మాంగ్, మాదిగలు ఒక్కటైనప్పటికీ.. మాంగ్‌లను వేరే గ్రూప్‌లో ఎందుకు వేశారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. మాంగ్‌లను గ్రూప్ బీలో చేర్చాలని డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాంగ్ కులస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చట్టరూపం దాల్చేలోపు నివేదికలోని లోపాలను సవరించాలని సీఎం, మంత్రులకు లిఖితపూర్వకంగా నివేదిక అందజేస్తామని తెలిపారు.