వర్గీకరణ.. మందకృష్ణకు ఇష్టం లేదు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:10 AM
ఎస్సీ వర్గీకరణ జరిగిందన్న ఆనందం కన్నా మంద కృష్ణలో ఆందోళన ఎక్కువయిందని మాదిగ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ అన్నారు.

ఈ నెలలో 20 లక్షల మందితో విజయోత్సవ సభ
రేవంత్‌రెడ్డిని ఘనంగా సన్మానిస్తాం: సతీశ్ మాదిగ
పంజాగుట్ట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ జరిగిందన్న ఆనందం కన్నా మంద కృష్ణలో ఆందోళన ఎక్కువయిందని మాదిగ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం, వర్గీకరణ జరగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. ఈ నెల చివరి వారంలో 20 లక్షల మందితో, 2 లక్షల డప్పులతో విజయోత్సవ సభ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా సన్మానం చేస్తామని వెల్లడించారు.
మంద కృష్ణ తలపెట్టిన ‘లక్ష డప్పులు, వేల గొంతులు’ కార్యక్రమాన్ని వాయిదా వేయడం తప్పన్నారు. ఏపీలో వర్గీకరణ జరగలేదు కనుక, వచ్చే నెల అందరం అక్కడికి వెళ్లి వర్గీకరణ కోసం ‘లక్ష డప్పులు, వేల గొంతులు’ ప్రదర్శనన చేపడదామని పిలుపునిచ్చారు. మాదిగ జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలని మందకృష్ణ కుట్ర చేస్తున్నారని సతీశ్ ఆరోపించారు.