Home » Mallikarjun Kharge
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు CRPF అధికారి తెలిపారు. Z+ ASL అనేది ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత స్థాయి రక్షణల్లో ఒకటిగా పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ప్రధాని మోదీని గద్దె దింపేంత వరకూ, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించేంత వరకూ రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు ముప్పు ఉంటుందని ఖర్గే అన్నారు. ప్రజల ఓట్లు, యువత ఉద్యోగాలు, రైతుల నుంచి ఎంఎస్‌పీని మోదీ దోచుకుంటున్నారని విమర్శించారు.
Rahul Gandhi Skip Red Fort: కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం ఎర్రకోటకు వెళ్లలేదు. వీరు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకపోవటంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తోడు.. ఓబీసీ ఓటుబ్యాంకుపైనా కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టిందా? ఈ విషయంలో తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బీసీ రిజర్వేషన్ బిల్లులనే అస్త్రాలుగా వాడేందుకు సిద్ధమైందా..
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.
ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో చర్చించేందుకు కాంగ్రెస్‌కు సుమారు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కష్టపడి పనిచేసినా ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.