Share News

Mallikarjun Kharge Health Update: నిలకడగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:27 PM

ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు తెలిపారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ, దేశంలోని ప్రముఖులు ఆరా తీసున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య..

Mallikarjun Kharge Health Update: నిలకడగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం
Mallikarjun Kharge Health Update

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. గుండెకు సంబంధించిన చికిత్స నిమిత్తం ఖర్గే బెంగళూరులోని రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.


ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోని ప్రముఖులు ఆరా తీసున్నారు. ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రిని సందర్శించి, ఖర్గే ఆరోగ్యం గురించి విచారించారు. అనంతరం ఖర్గే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2025 | 03:05 PM