Home » Madhya Pradesh
భారతీయ జనతా పార్టీకి వరుసగా రెండో వారం కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం మరవకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.
పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. ఇంట్లో నిద్రపోతున్న ఆమెను పులి ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై కన్నుమూసింది.
రిటైర్‌మెంట్ రోజున మధ్య ప్రదేశ్‌కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు.
రైతుల ఆందోళనలో సాహసోపేతంగా వ్యవహరించారు ఓ పోలీస్ అధికారిణి. ఆమె చూపిన ధైర్యసాహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. తొండంతో నేలకేసి కొట్టి చంపేసింది. ఏనుగుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించగా ఈ విషాదం చోటుచేసుకుంది.
యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఈ మేరకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లు ఆమోదం పొందింది.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల-కమాల్ మౌలా మసీదు సముదాయం వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం అత్యంత సున్నితమైనదని పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ పరిధిలో అల్లర్లు చెలరేగాయి. దాటియా ఉపఎన్నికకు తమ పార్టీ అభ్యర్థిగా అశుతోష్ తివారిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించడంతో వివాదం మొదలైంది.
తాగే నీళ్లలో మత్తు మందు కలుపుతున్నాడన్న అనుమానంతో బ్యూటీ పార్లర్ యజమానిపై మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చెప్పులతో సమాధానం చెప్పారు. 43 సార్లు యజమానిని చెప్పుతో చావగొట్టారు.
ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్పురా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.