Share News

ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:03 PM

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ‌ధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడిించారు.

ఎఫ్‌ఏటీఎఫ్  వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి
Vivek Aggarwal FATF Vice President

ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తాజాగా కీలక బాధ్యతలు లభించాయి. టెర్రరిస్టుల ఆర్థికమూలాలు, అక్రమ నగదు రవాణా నెట్వర్క్‌లను దెబ్బతీసేందుకు ఏర్పాటు చేసిన పైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)కు వైస్‌ప్రెసిడెంట్‌గా మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా అంతర్జాతీయంగా చేపడుతున్న చర్యల్లో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఇది ఒక భారీ విజయమని వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఏటీఎఫ్‌లో ఒక భారత అధికారికి ఇంతటి కీలక బాధ్యతలు దక్కడం ఇదే తొలిసారి.


ఎవరీ వివేక్ అగర్వాల్..

ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీగా ఉన్నారు. అంతకుముందే, కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, మధ్యప్రదేశ్‌లో వివిధ స్థాయిల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ కేడర్‌లో చీఫ్ సెక్రటరీ గ్రేడ్ అధికారిగా 2025లో పదోన్నతి సాధించారు. గతంలో ఆయన రెవెన్యూ శాఖ అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. పరిపాలన, ఆర్థిక అంశాల నిర్వహణలో విశేష గుర్తింపు పొందారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీకామ్, ఎల్ఎల్‌బీ చేసిన ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నుంచి సీఎస్(ఇంటర్) కూడా చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌‌‌లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ప్రత్యేక కోర్సు కూడా చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో హిందువుల నిరసన.. ఢాకాలో భారీ ర్యాలీ

నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

Updated Date - Jun 20 , 2026 | 01:25 PM