కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు.. సోదాల్లో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగి చెప్పింది విని..
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:51 PM
మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ లక్ష్మీనారాయణ్ కంద్వాల్‌కు చెందిన నివాసాలు, వ్యాపార సంస్థలు, ఇతర ప్రాంగణాల్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.11 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు (Madhya Pradesh Lokayukta raid).
ఇంత భారీ ఆదాయం పోగుపడడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుని దర్యాప్తు అధికారులు షాకయ్యారు. తన భార్య కుట్టు మిషన్, అల్లికలతో అన్ని కోట్లు సంపాదించిందని లక్ష్మీనారాయణ్ చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. 1996 నుంచి ఉద్యోగం చేస్తున్న లక్ష్మీ నారాయణ్ పొందిన వేతనం సుమారు రూ.2.5 కోట్లు కాగా, వ్యవసాయ రాబడి కలిపి మొత్తం చట్టబద్ధ ఆదాయం రూ.2.8 కోట్లుగా అంచనా వేశారు. అయితే దర్యాప్తులో ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చర ఆస్తుల విలువ రూ.10.83 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు (Disproportionate assets case).
సోదాల్లో భారీ భవనం, ప్లాట్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్, జిమ్‌కు సంబంధించిన ఆస్తులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు బయటపడ్డాయి (Sewing income claim). ఇంట్లో ఉన్న వస్తువుల విలువ దాదాపు రూ.38.49 లక్షలు కాగా, బ్యాంక్ లాకర్‌లో లభించిన బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.24.76 లక్షలుగా అంచనా వేశారు. తన భార్య గృహిణి అయినప్పటికీ కుట్టు, అల్లిక పనులు చేసి ఆదాయం సంపాదించిందని లక్ష్మీనారాయణ్ అధికారులకు చెప్పడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..