Home » Madakasira
ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో కూరగాయల మార్కెట్ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.
కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వాటి నిర్వహణను సంబంధిత అఽధికాలరులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 131 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్ నారీసశక్త్ పరివార్ అభియాస్ అనే కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు.