Share News

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:01 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్‌ నారీసశక్త్‌ పరివార్‌ అభియాస్‌ అనే కార్యక్రమం నిర్వహించారు.

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
The chairman and doctors cut the ribbon and inaugurated the program.

మడకశిర టౌన, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్‌ నారీసశక్త్‌ పరివార్‌ అభియాస్‌ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో మహిళలకు, కిశోర బాలికలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారన్నారు. గర్భిణులు, వృద్ధులకు వివిధ పరీక్షల నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కెట్‌ యార్డు చైర్మన గురుమూర్తి, వైద్యులు శశిరేఖ, ప్రభాకర్‌నాయుడు, మోహన, నీరజ పాల్గొన్నారు.

మడకశిర రూరల్‌(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమై మహిళలు ఉంటేనే బ లమైన కుటుంబాలు ఏర్పడతాయని డాక్టర్లు నరేష్‌ కుమార్‌, లిఖీత అన్నా రు. శుక్రవారం మండలంలోని కదిరేపల్లి,కల్లుమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి గుర్రపుకొండ, సి.కోడిగేపల్లి గ్రామాల్లో స్వస్థ్‌నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్‌ వైజర్‌ రాంప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:01 AM