DOCUMENT WRITERS: దస్తావేజు లేఖరుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:57 PM
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు.
మడకశిర టౌన, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విఽధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజులేఖరులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఆధార్ ఓటీపీ, స్థానిక డేటా బేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లులో పలుమార్లు సాంకేతక సమస్యలు వస్తుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో క్రయ విక్రయదారులు పలు మార్లు వారు కట్టిన చాలానా డబ్బులు సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానంలో మార్పులు అవసరమని అన్నారు. అనంతరం సబ్ రిజిసా్ట్రర్ నరసింహమూర్తికి వినతి పత్రం అందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డీప్యూటీ తహసీల్దార్ నరే్‌షబాబుకు వినతి పత్రం అందించారు. లోకేష్, షమీవుల్లా, జిలాన, రాజన్న, ఆలప్ప, నాగేంద్ర, సన్నప్ప, చంద్రప్ప, రమేష్ పాల్గొన్నారు.