Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:37 PM
కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
మడకశిర(అనంతపురం): కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర(Madakashira) ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా(Handri Neeva) కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీరు మండలంలోని మణూరు చెరువుకు చేరడంతో పూర్తిగా నిండిపోయింది. బుధవారం మరువ పోయింది. హరేసముద్రం చెరువుకు కృష్ణాజలాలు చేరుతున్నాయి.
మడకశిర ప్రాంతంలోని మరిన్ని చెరువులను నింపనున్నట్లు హంద్రీనీవా అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా సరైన వర్షాలు కురవక చేరువులో నీరులేక భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన చెందారు. ప్రస్తుతం కృష్ణాజలాలతో చెరువు నిడడంతో తాగు, సాగునీటి సమస్య పరిష్కారం కావడమేకాక బోర్ల కింద భూములు కూడా సాగులోకి వస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chief Minister Chandrababu Naidu) గతేడాది నియోజకవర్గంలో పర్యటించినపుడు ఈ ప్రాంతంలోని చెరువులను కృష్ణాజలాలతో నింపి.. తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ నీటితో చెరువులను నింపుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News