SACHIVALAYAM: సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:09 AM
గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వాటి నిర్వహణను సంబంధిత అఽధికాలరులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 131 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
ఇబ్బందిపడుతున్న ప్రజలు
మడకశిర రూరల్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వాటి నిర్వహణను సంబంధిత అఽధికాలరులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 131 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రజలు ఎక్కువగా రెవెన్యూ, సర్వే, వ్యవసాయం, పశుసంవర్థక, పంచాయతీ కార్యదర్శుల కోసం సచివాలయాలకు వస్తుంటారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది. సచివాలయాలకు ప్రజలు వచ్చి అధికారలు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు. సోమవారం గంగళవాయిపాళ్యం సచివాలయంలో కేవలం వెల్ఫేర్ అసిసెంట్ మాత్రమే ఉందుబాటులో ఉన్నారు. డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో సచివాలయంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని తొలగించారు. ప్రభుత్వ సేవలు సచివాలయాలల్లో నమోదు చేసేవారు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్వో లేకపోవడం, సర్వేయర్ ఉన్నా ఎప్పుడు వస్తారో తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారలు దృష్టిసారించి సచివాలయ సిబ్బంది ప్రజలకు అందబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.