Home » Lpg Price
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీకి, ముడి చమురు దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై నిపుణుల అభిప్రాయం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల వంటగదికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు నిలిచిపోవడంతో వంట గ్యాస్‌కు తీవ్ర కొరత వచ్చి పడుతుందనే ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్యాస్ సమస్య వచ్చిందని ఫైర్ అయ్యారు.
ఇరాన్ యుద్ధ ప్రభావం పరిశ్రమల్లోని క్యాంటీన్లపై పడింది. వంట గ్యాస్ సంక్షోభంతో క్యాంటీన్ల నిర్వాహకులు టిఫిన్లు, కూరలు, చపాతీలకు కోత విధించారు.
హైదరాబాద్ అంటేనే ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌కు ఫేమస్. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి! ముఖ్యంగా..
వంట గ్యాస్ కొరత తాలూకూ సెగ.. అయోధ్య రాముడి వంటగది సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల పాకశాలలను తాకింది.