ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డై మిథైల్ ఈథర్.. ఐఐసీటీ డైరెక్టర్ వెల్లడి..
ABN , Publish Date - Mar 14 , 2026 | 10:47 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల వంటగదికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు నిలిచిపోవడంతో వంట గ్యాస్‌కు తీవ్ర కొరత వచ్చి పడుతుందనే ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల వంటగదికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతులు నిలిచిపోవడంతో వంట గ్యాస్‌కు తీవ్ర కొరత వచ్చి పడుతుందనే ఆందోళనలు మిన్నంటాయి. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు. మనదేశం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడడమే ఈ సమస్యలకు కారణం. అలా కాకుండా దేశీయంగానే ఎల్పీజీకి ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకుంటే ఈ కష్టాలు చాలా వరకు తొలగిపోతాయి (Dimethyl Ether LPG alternative).
ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా డై మిథైల్ ఈథర్‌ను అదుబాటులోకి తెచ్చేందుకు హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్ డై అక్సైడ్‌ను వినియోగించుకుని డై మిథైల్ ఈథర్‌ను తయారు చేసుకోవచ్చని చెప్పారు. మనం ఉపయోగించే ఎల్పీజీలో ప్రొపెన్, బ్యూటేన్ వాయువులు ఉంటాయి. డై మిథైల్ ఈథర్ కూడా దాదాపు ఈ వాయువులనే పోలి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ వ్యవస్థల్లో స్వల్ప మార్పులు చేసుకుని దీనిని ఉపయోగించుకోవచ్చు.
ఎల్పీజీకి మాత్రమే కాదు.. డీజిల్‌కు కూడా డై మిథైల్ ఈథర్‌ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాటికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజుకు 180 కిలోల డై మిథైల్ ఈథర్ ఉత్పత్తి చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం డై మిథైల్ ఈథర్ ఉత్పత్తి ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎస్‌టీ) సహకారంతో బీహెచ్ఈఎల్‌తో కలిసి ఐఐసీటీ ఈ వినూత్న ప్రక్రియను అభివృద్ధి చేసింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..