దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..
ABN , Publish Date - Mar 14 , 2026 | 07:29 AM
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం.
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల కలల నగరం. పెట్టుబడులకు, రక్షణకు, స్వేచ్ఛా జీవితానికి దుబాయ్ ప్రతీక. విమానయాన రంగానికి కీలక స్థానం. ఎప్పుడూ విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే నగరం. అలాంటి మహా నగరాన్ని ఇరాన్ యుద్ధం కళా విహీనంగా మార్చింది. పశ్చిమాసియాలో యుద్ధం దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపించింది (Dubai ghost city).

యుద్ధం నేపథ్యంలో దుబాయ్ నగరం బోసిపోయింది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలను మూసేశారు. రోడ్లపై జనసంచారం లేదు. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బీచ్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురి కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు (Dubai empty beaches video).
విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో పర్యాటక రంగమూ కుదేలైంది (Dubai viral photos). ప్రముఖ హోటళ్లన్నీ మూతపడ్డాయి. సందర్శకులను ఆకట్టుకునేందుకు హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నప్పటికీ స్పందన రావడం లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టెర్డ్ వంటి అంతర్జాతీయ బ్యాంకులు తమ ఆఫీస్‌లను ఖాళీ చేసేశాయి. దీంతో నగరంలో జనసంచారం లేదు.

ఇవి కూడా చదవండి..
చిన్నారికి తృటిలో తప్పిన ప్రమాదం! ఫోన్ చూస్తుండగా..
ఒకే బోగీలో 30 మంది.. ఈ ఫ్యామిలీ రచ్చ చూస్తే..