Home » Lok Sabha
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.
ఆపరేషన్ సింధూర్ హైలైట్స్ను జే పాండా వివరిస్తూ, భారత వాయిసేన పాక్లోని 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, 20 శాతం పాక్ వాయిసేన ఆస్తులను ధ్వంసం చేసిందని చెప్పారు. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగి 100 రోజులైన తర్వాత కూడా ఆ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోవడంలో కేంద్ర వైపల్యాన్ని గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
పాకిస్థాన్లోని పలు వైమానిక కేంద్రాలపై భారత వాయిసేన భీకరంగా విరుచుకుపడటంతో పాకిస్థాన్ ఓటమిని అంగీకరించి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్కు విరామం ఇచ్చేందుకు కేవియట్తో ఆమోదించామని తెలిపారు.
నేడు పార్లమెంటు సమావేశాలు ఉదయం మొదలైన కొద్ది సేపటికే హంగామా వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష నేతలు లోక్సభ, రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలను వాయిదా వేశారు.
ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద ఎన్టీఆర్ జిల్లాకి పీఎం-శ్రీ పాఠశాలల కేటాయింపు చాలా తక్కువగా ఉన్న అంశాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో మంగళవారం ప్రస్తావించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలపై ..