Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ABN , Publish Date - Aug 20 , 2025 | 09:51 PM
నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల జైలు కానీ రూ.కోటి జరిమానా కానీ, రెండూకానీ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ గేమ్స్‌కు సంబంధించి అడ్వర్టయిజ్‌మెంట్లలో భాగం పంచుకుంటే గరిష్టంగా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెడుతూ కేంద్రం తీసుకువచ్చిన 'ది ప్రమేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025' బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో బుధవారంనాడు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బెట్టింగ్ యాప్‌లకు కొంతమంది బానిస అవుతుండటం, మనీలాండరింగ్, ఆర్థిక అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది.
బిల్లుపై అశ్వని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ-స్పోర్ట్స్‌కి అధికారిక గుర్తింపు, అలాగే శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సోషల్, విద్యా గేమ్స్ అభివృద్ధికి కేంద్రం మద్దతు తెలుపుతోందని, తద్వారా భారతీయ విలువలతో గేమ్స్ ప్రోత్సాహం అందిస్తుందని అన్నారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ప్రకటనలు, లావాదేవీలు నిషేధం – బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ బ్లాక్ చేస్తారు. కేంద్ర స్థాయిలో ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు సంసిద్ధత. నిబంధనల ఉల్లంఘనకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. డిజిటల్ ఇండియాలో సమతుల్యత, వినూత్నతకు ప్రోత్సాహం, సమాజ రక్షణకు ఈ బిల్లు పాటుపడుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల జైలు కానీ రూ.కోటి జరిమానా కానీ, రెండూకానీ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ గేమ్స్‌కు సంబంధించి అడ్వర్టయిజ్‌మెంట్లలో భాగం పంచుకుంటే గరిష్టంగా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు, రూ. కోటి జరిమానా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
మధ్యయుగాలకు నెట్టేసే బిల్లు: రాహుల్ గాంధీ
అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆర్మీ చీఫ్ దంపతులు
For National News And Telugu News