Home » Kukatpally
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని హనుమాన్‌దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ కూకట్‌పల్లిలో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 23, బెండకాయ 38, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 40, కాకరకాయ 31, బీరకాయ 41, క్యాబేజీ 17, బీన్స్ 45, క్యారెట్ 38, గోబి పువ్వు 25, దొండకాయ 33, చిక్కుడు కాయ 45లకు విక్రయిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్‌డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌లో భర్త, కుమారుడితో నివాసం ఉంటుంది. అయితే.. హర్ష కొద్ది రోజుల క్రితమే ఆ ఇంట్లో పనికి కుదిరాడు.
కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
బీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌తో గెలిచి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్స్‌లో రేణు అగర్వాల్ హత్యను తీవ్రంగా ఖండించారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 17, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 38, బజ్జి మిర్చి 40, కాకరకాయ 26, బీరకాయ 40, క్యాబేజీ 18, బీన్స్ 48, క్యారెట్ 40, గోబి పువ్వు 30, దొండకాయ 36, చిక్కుడు కాయ 45, గోరు చిక్కుడు 35, బీట్‌రూట్ 23, క్యాంప్సికం 55, ఆలుగడ్డ 23, కీర 18, దోసకాయ 18, సొరకాయ 20, పొట్లకాయ 18, కంద 40, ఉల్లిపొరక 28లకు విక్రయిస్తున్నారు.