MLA: బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం..
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:25 AM
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని హనుమాన్‌దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని హనుమాన్‌దేవాలయం వద్ద బతుకమ్మ ఆడే స్థలాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, బందోబస్తు, ఇతర వసతులపై సూచనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా రంగధాముని చెరువు కట్టపై జరుగుతున్న బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

పూలతో బతుకమ్మను చేసి గౌరమ్మను పూజించే సంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తుందన్నారు. బతుకమ్మ ఆడేందుకు మహిళలు పెద్ద ఎత్తున వస్తారని, వారందరికీ ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా బతుకమ్మ చీరలు ఇచ్చామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చీరలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, వెంకటేశ్, ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లపోచమ్మ ఆలయంలో పూజలు..
బాలానగర్: బాలానగర్(Balanagar) డివిజన్ ఇందిరానగర్ నల్లపోచమ్మ ఆలయంలో గురువారం జరిగిన మండల పూజలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణను నిర్వాహకులు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News