Hyderabad: కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ క్లోజ్..
ABN , Publish Date - Sep 18 , 2025 | 07:45 AM
సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
- కొల్లూరులో కొత్త పోలీస్స్టేషన్ ఏర్పాటు!
- ప్రణాళికలు సిద్ధం చేస్తున సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్‌సిటీ: సైబరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్(Cyberaba) ట్రాఫిక్ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మూసివేసేందుకు అధికారులు నిర్ణయించినట్లుగా తెలిసింది. కేపీహెచ్‌బీని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కలిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

నిజానికి సైబరాబాద్ ఐటీ కారిడార్ గుండెకాయలాంటి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్(Madhapur, Gachibowli, Kondapur) ప్రాంతాలకు డైరెక్టు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం కేపీహెచ్‌బీ. అక్కడ జనసాంద్రత, వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు మూడేళ్ల క్రితం కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ట్రాపిక్ క్రమబద్ధీకరణలో భాగంగా కేపీహెచ్‌బీని మరింత విస్తరించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అధికారులు మాత్రం మూసివేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్తగా కొల్లూరులో..
సైబరాబాద్ కమిషనరేట్ విస్తృతంగా అభివృద్ధి చేందుతున్న నేపథ్యంలో కొల్లూరులో కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కొద్దిరోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేడో రేపో ప్రభుత్వం నుంచి ఉత్తర్వూలు రాగానే కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మేడ్చల్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో కొన్ని మార్పులు చేసి, ట్రాపిక్ క్రమబద్ధీకరణకు అనుగుణంగా విస్తృతంగా మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News