MLA: ఎమ్మెల్యే మాధవరం సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలవండి
ABN , Publish Date - Sep 13 , 2025 | 10:45 AM
బీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌తో గెలిచి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి సవాల్ విసిరారు.
- కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సవాల్
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌తో గెలిచి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishnarao) వారికి సవాల్ విసిరారు. హైకోర్టు తీర్పుతో తమ ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఊడుతుందోననే భయంతో బీఆర్‌ఎ్‌సను వీడలేదని దొంగమాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
నిజంగా బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే పార్టీ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించినా స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమనార్హం అన్నారు. గతంలో టీడీపీ టికెట్‌పై గెలిచిన తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నానని, నాలుగేండ్లలో అభివృద్ధి చేయకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నియోజకవర్గంలో చెప్పి, అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధితోనే కార్పొరేషన్ ఎన్నికల్లో 9 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను పజలు గెలిపించారని గుర్తు చేశారు.

షేర్‌గల్లీలో మదర్సా ప్రారంభం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఓల్డుబోయినపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. డివిజన్ పరిధి షేర్‌గల్లీలో ఏర్పాటు చేసిన నేమ్‌బోర్డు, మదర్సాను కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు గౌసొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News