MLA: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. లా అండ్ ఆర్డర్ ఏమైంది
ABN , Publish Date - Sep 12 , 2025 | 10:09 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్స్‌లో రేణు అగర్వాల్ హత్యను తీవ్రంగా ఖండించారు.
- కృష్ణారావు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్స్‌లో రేణు అగర్వాల్(Renu Agarwal) హత్యను తీవ్రంగా ఖండించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సహస్ర హత్య, కేపీహెచ్‌బీలో వృద్ధ దంపతులను కట్టేసి బంగారు నగలు దోచుకెళ్లడం, తాజాగా రేణు అగర్వాల్ హత్య ఏం జరుగుతోంది. హోం శాఖను సీఎం దగ్గర ఉంచుకొని కూడా ఏం ప్రయోజనం అని ఆయన అడిగారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్ కూడా రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, నిందితులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నమ్మకంతో ఉపాధి ఇస్తే ఆ ఇంటి యజమానురాలిని డబ్బు కోసం చంపేయడం బాధేస్తుందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని బండి రమేష్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News