JNTU: ఔత్సాహిక పరిశోధకులకు జేఎన్‌టీయూ డబుల్ ధమాకా
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:35 AM
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్‌డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
- రెట్టింపు సంఖ్యలో పెరగనున్న పీహెచ్‌డీ సీట్లు
హైదరాబాద్ సిటీ: పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్‌టీయూ(JNTU) ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్‌డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఏప్రిల్ నెలలో విడుదల చేసిన పీహెచ్‌డీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌లో వివిధ ఇంజనీరింగ్,
మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో మొత్తం 215 సీట్లను పేర్కొనగా, ఆ సంఖ్య దాదాపు 450కి పెంచేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. రెగ్యులర్ ఆచార్యుల పదవీ విరమణ వయస్సును ఇటీవల ప్రభుత్వం పెంచడంతో ఎక్కువమంది ఆచార్యులకు రీసెర్చ్ స్కాలర్స్‌ను కేటాయించేందుకు సీట్ల సంఖ్య పెంపు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ప్రవేశపరీక్షలో 650మందికి అర్హత
మరోవైపు ఈ నెల 12నుంచి 14వరకు జరిగిన పీహెచ్‌డీ ప్రవేశపరీక్షలకు హాజరైన సుమారు 750మంది అభ్యర్థుల్లో 650మందికి పైగా అర్హత సాధించడం.. సీట్ల పెంపు యోచనకు మరొక కారణంగా కనిపిస్తోంది. ఇంకోవైపు నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్స్ కోటాలో ఎక్కువ మంది జేఎన్‌టీయూ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఆసక్తిని కనబరుస్తుండడం,

సీఎస్ఐఆర్, జేఆర్‌ఎఫ్ వంటి జాతీయ స్థాయి స్కాలర్‌షిప్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా సుమారు 200మంది పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో సీట్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఒక్కొక్క ఆచార్యునికి ముగ్గురు స్కాలర్స్‌ను కేటాయించాలని భావిస్తున్నారు. మరోవైపు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లోని రీసెర్చ్ సెంటర్లకు కూడా స్కాలర్స్‌ను కేటాయించే అంశంపైనా సుదీర్ఘమైన చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News