MLA: 20 నుంచి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 09:33 AM
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ (ఎంగిలిపూల బతుకమ్మ కూకట్‌పల్లిలో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలి బతుకమ్మ వేడుకలను (ఎంగిలిపూల బతుకమ్మ) కూకట్‌పల్లి(Kukatpally)లో అమావాస్యకు ఒక్కరోజు ముందుగానే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) తెలిపారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోనే అతి పెద్ద పండగైన బతుకమ్మ, దసరా వేడుకలను కూకట్‌పల్లిలో వైభవంగా నిర్వహిస్తామన్నారు.

ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని ఈ నెల 20న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, 29న సద్దుల బతుకమ్మ వేడుకలు రంగదాముని చెరువు వద్ద నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అక్టోబరు 2 సీతారామాలయంలో సాయంత్రం జమ్మిపూజ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News