Home » Kukatpally
కూకట్‌పల్లి వైష్ణవి కాలనీలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్ కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్కెట్ వర్గాలు అందించిన వివరాల ప్రకారం ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ధరలు కొంచెం పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి రైతుబజార్‌లో ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే...
కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాట 37, వంకాయ 23, బెండకాయ 40, పచ్చిమిర్చి 45, బజ్జిమిర్చి 55, కాకరకాయ 26, బీరకాయ 26, క్యాబేజీ 13, బీన్స్ 60, క్యారెట్ 41, గోబిపువ్వు 20, దొండకాయ 23, చిక్కుడుకాయ 55, గోరుచిక్కుడు 28aలకు విక్రయిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకని, బీఆర్‌ఎస్ పార్టీని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను అప్రదిష్ట పాల్జేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
ఇంజనీరింగ్ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్‌టీయూ సరికొత్త సిలబస్‌ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్ 25 రెగ్యులేషన్స్ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్ అఫైర్స్ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది.
విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఫిట్) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్‌టీయూకు వారు చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడైన కూన శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తాళలేక ఆయన కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అంకెనపల్లి కుమార్ (28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. ఆడెపు విజయ్(35) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.
హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కల్లు కంపౌండ్లు, దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.