Hyderabad: ఆ 9ఎంఎం బుల్లెట్ ఎవరిది...
ABN , Publish Date - Oct 23 , 2025 | 07:36 AM
మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station)లో ఈనెల 18న తనిఖీల్లో బయట పడిన 9ఎంఎం బుల్లెట్ ఎవరిది?. ఆ యువకుడి చేతికి ఎలా వచ్చింది.. అనే దానిపై మిస్టరీ వీడలేదు. దాంతో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్ సిటీ: మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station)లో ఈనెల 18న తనిఖీల్లో బయట పడిన 9ఎంఎం బుల్లెట్ ఎవరిది?. ఆ యువకుడి చేతికి ఎలా వచ్చింది.. అనే దానిపై మిస్టరీ వీడలేదు. దాంతో కూకట్‌పల్లి పోలీసులు(Kukatpally Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న బుల్లెట్‌ను ఎఫ్‌ఎస్ఎల్(FSL)కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల నుంచి రిపోర్టు రావడానికి సుమారు 45 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
అయితే, బుల్లెట్ యువకుడి చేతికి ఎలా వచ్చిందనే విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. బుల్లెట్ కలిగి ఉన్న మహ్మద్ అలాం (28).. తన తాత మిలిటరీలో పనిచేసినప్పుడు తీసుకొచ్చాడని, అది బిహార్(Bihar)లోని తన ఇంట్లో ఉంటే గుర్తుగా తాను తెచ్చుకున్నానని పోలీసులకు వెల్లడించాడు. అయితే 9ఎంఎం బుల్లెట్స్ మిలిటరీలో ఇవ్వరని, అక్కడ పనిచేసే పోలీసులు లేదా ప్రైవేటు వ్యక్తుల వద్ద మాత్రం ఆ బుల్లెట్స్ ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు.
మహ్మద్ ఆలంకు నోటీసులు ఇచ్చామని, చెన్నై(Chennai)లో ఉన్న అలం తండ్రితో మాట్లాడగా.. ఆయన కూడా తన తండ్రి మిలటరీలో పనిచేసిన మాట వాస్తవేనని.. ఆయన చనిపోయాడని చెప్పారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఎఫ్‌ఎ్‌సఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత బుల్లెట్‌పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..
మావోయిస్టు మద్దతుదారులపై నజర్!
Read Latest Telangana News and National News