KPHB: కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి యువకుల వీరంగం
ABN , Publish Date - Oct 16 , 2025 | 07:49 AM
కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి హాస్టల్ యువకులు వీరంగం సృష్టించారు. తమ ఇంటి ఎదుట ద్విచక్రవాహనాలను పార్క్ చేయొద్దన్న దంపతులపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- ఇంటి ఎదుట బైక్‌లు పార్క్ చేయొద్దన్న దంపతులపై దాడి
హైదరాబాద్: కేపీహెచ్‌బీ(KPHB)లో అర్ధరాత్రి హాస్టల్ యువకులు వీరంగం సృష్టించారు. తమ ఇంటి ఎదుట ద్విచక్రవాహనాలను పార్క్ చేయొద్దన్న దంపతులపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్-5లోగల ఆంజనేయ, శివ మెన్స్ హాస్టళ్లలో ఉంటున్న యువకులు పవన్ నరసింహనాయుడు(Pavan Narasimha Naidu) ఇంటి ఎదుట నిత్యం బైక్‌లను పార్క్ చేస్తున్నారు. విషయాన్ని అతడు హాస్టల్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. అయినా పట్టించుకోలేదు.

మంగళవారం అర్ధరాత్రి కొందరు యువకులు నరసింహనాయుడు ఇంటి ఎదుట వాహనాలను పార్క్ చేస్తుండగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తులైన యువకులు సుమారు 20 మంది పవన్ నరసింహనాయుడు దంపతులపై దాడి చేశారు. బాధితుడు హాస్టల్ మేనేజ్‌మెంట్, యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్‌బీలో ఉంటున్న హాస్టళ్ల వల్ల సమస్యలు వస్తున్నాయని స్థానికులు కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News