MLA: బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:23 AM
బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. మంగళవారం ఎర్రగడ్డలోని షంషీర్ ఫంక్షన్ హాల్‌లో డివిజన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) పాలనలో సంక్షేమం, అభివృద్ధిని గుర్తు చేయాలన్నారు.

ఈనెల 5 నుంచి ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ సలీం, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సతీష్ అరోరా, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !
Read Latest Telangana News and National News