Home » KCR
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్‌రావు.. తెలంగాణ హైకోర్టున ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు.
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్య గ్రాడ్యుయేషన్ చదివేందుకు అమెరికా వెళ్తున్న సందర్భంగా అతనికి తాత ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు.
బీఆర్ఎస్ కీలక నేతలు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు క్యూకడుతున్నారు. కేటీఆర్, హరీశ్ సహా ముఖ్య నేతలు ఇప్పటికే ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరినట్టు సమాచారం. మరికాసేపట్లో జరిగే భేటీలో పలు అంశాలు చర్చించే..
కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్, కేటీఆర్‌లు దూరం పెట్టారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ సమయంలో ఫాంహౌస్‌కు కవిత వెళ్లింది.
భారత స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కేసీఆర్ కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ దొంగఓట్ల విషయంలో వైసీపీ వారే.. హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి నేర్పించినట్టు ఉందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏలో బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు తమ పార్టీ మెంబరే అని తెలిపారు.
జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు.
మాజీ సీఎం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అసలు అద్భుతమే కాదని విమర్శించారు. కాళేశ్వరం నివేదిక రావడంతో.. బీఆర్ఎస్ నాయకులు నోళ్లు మెదపడం లేదని పేర్కొన్నారు. నివేదికతో బీఆర్ఎస్ బాగోతం బట్టబయలైందని తెలిపారు.