BRS Governance: బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయి: కేసీఆర్
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:31 PM
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను కేసీఆర్ తన ఫాం హౌస్‌కు ఆహ్వానించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు.
బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లను కేసీఆర్ తన ఫాం హౌస్‌కు ఆహ్వానించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు.
తొలి విడతలో 395 ఏకగ్రీవాలు
తొలి విడతలో ఎన్నికల జరగనున్న 4,236 సర్పంచ్ స్థానాల్లో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని 26 స్థానాలు ఉన్నాయి. ఈ 26 మందిలో 25 మంది కాంగ్రెస్ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీకి చెందిన వారు.
ఇవి కూడా చదవండి
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
రాహుల్, ఖర్గేను కాదని.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం