Jagga Reddy : అందుకే బీఆర్ఎస్ నుంచి తప్పుకున్నా.. కవితపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:14 PM
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిది ఓ ప్రత్యేక స్టైల్ అని చెప్పొచ్చు. సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజీయాల్లో తనదై మార్క్ చాటుకుంటున్నారు. జగ్గారెడ్డి రాజకీయాలపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. జగ్గారెడ్డి (Jaggareddy) బీఆర్ఎస్ పార్టీని వీడటానికి అసలు కారణం హరీష్ రావు (Harish Rao)తో ఉన్న అంతర్గత వైరం అంటూ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అవి పూర్తిగా నిరాధారమైనవి.. హరీష్ రావుతో గొడవపడి నేను పార్టీ మారానంటూ కవిత కట్టుకథలు అల్లుతుంది. నేను పార్టీని వీడటానికి అసలు కారణం హరీష్ రావు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లా (Medak District)లో సంగారెడ్డి అభివృద్ది కోసం నేను పాటుపడుతుంటే.. నన్ను కొందరు టార్గెట్ చేశారు.
నా రాజకీయ భవిష్యత్ బాగుండాలని పార్టీ మారాను. మొదటి నుంచి నాకు.. హరీష్ రావుకి ఎలాంటి శత్రుత్వం లేదు. ఆయన రాజకీయాలు వేరు.. నా రాజకీయ వేరు అని అన్నారు. నా పార్టీ మార్పుపై కవిత తప్పువు స్టేట్‌మెంట్స్ ఇస్తుందని ఫైర్ అయ్యారు. ఇకపై కవిత అభిమాన సంఘాలు నాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం ఆపేయాలి.. చిల్లర ట్రిక్స్ చేయొద్దు అని హెచ్చరించారు. కేసీఆర్ లేకుంటే అసలు కవిత లేదు. ఎప్పటికైనా ఆమె కేసీఆర్ కూతురుగానే గుర్తింపు ఉంటుంది. మీ కుటుంబ విషయాల్లో నన్ను లాగొద్దు. కవిత తన కుటుంబ సమస్యలు, పార్టీ అంతర్గత విభేదాల్లో హరీష్ రావును ఇరికించే ప్రయత్నం చేస్తుంది. నేను కాంగ్రెస్ లో చేరడానికి ముఖ్య కారణం వైఎస్సాఆర్.
నేను బీఆర్ఎస్ (BRS)ఎమ్మెల్యే గా ఉన్నపుడు సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలను గెలిపించడం చూసి మెచ్చుకొని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కంది ఐఐటీ (IIT Hyderabad) కి పునాది వేసింది వైఎస్సాఆర్. ఐఐటీ కోసం రైతులు ఇచ్చిన భూములకు ఊహించని సహాయం చేశారు. రాజకీయాల్లో నాకు, హరీష్ రావుకు ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇకపై కవిత ఇతరుల గురించి మాట్లాడటం కంటే..ముందు తన కుటుంబ రాజకీయాల గురించి ఆలోచిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. సీఎం అయితా అని ఎవరైనా మాట్లాడితే నాకు నవ్వోస్తుందని అన్నారు.
ఇవీ చదవండి: