Home » KCR
చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరంపై వాస్తవాలతో కూడిన నివేదికను కేంద్రం ఎదుట ఉంచామని తెలిపారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్‌కు సూచించానని, సవాల్ చేయలేదన్నారు.
తెలంగాణ సిద్ధించాక రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గోదావరి, కృష్ణ జలాలపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్దమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
కేసీఆర్ హయాంలో రూ.లక్షల కోట్ల అప్పులు చేసి.. కూలిపోయే కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు కుంగిపోయి కూలిపోతున్నా..
తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడింది.
ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్‌మీట్ పెడతానని బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే దక్కుతుందని ఆయన సోదరుడు వజ్రనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను గురువారం నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు కోరే అన్ని అంశాలు అక్కడ చర్చిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.