Share News

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

ABN , First Publish Date - Aug 31 , 2025 | 08:26 AM

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతోంది. దీనిపై సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

Live News & Update

  • Aug 31, 2025 20:38 IST

    అసెంబ్లీలో BRS సభ్యుల నినాదాలు

    • హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

    • చర్చ ముగించాలని పదేపదే హరీష్‌రావుకి స్పీకర్‌ విజ్ఞప్తి

    • హరీష్‌రావుకి ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువే ఇచ్చామన్న స్పీకర్‌

  • Aug 31, 2025 18:44 IST

    ఉత్తమ్‌ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: హరీష్‌రావు

    • గతంలో కాళేశ్వరంపై కేసీఆర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చినప్పుడు..

    • ప్రిపేర్‌ కాలేదని గతంలో ఉత్తమ్‌ వెళ్లిపోయారు: హరీష్‌రావు

  • Aug 31, 2025 18:44 IST

    హరీష్‌రావు తప్పుదారి పట్టిస్తున్నారు: సీఎం రేవంత్..

    • సభను, ప్రజలను హరీష్‌రావు తప్పుదారి పట్టిస్తున్నారు: సీఎం రేవంత్

    • కమీషన్ల కోసమే ప్రాజెక్టు ప్రాంతం మార్చారు: సీఎం రేవంత్‌

    • ప్రాణహితలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009లోనే CWC లేఖ ఇచ్చింది: సీఎం రేవంత్‌

  • Aug 31, 2025 18:34 IST

    బ్యారేజీల గురించి హరీష్‌రావు మాట్లాడాలి: మంత్రి కోమటిరెడ్డి

    • శిక్ష తప్పించుకోవాలని హరీష్‌రావు చూస్తున్నారు: కోమటిరెడ్డి

    • కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    • ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో వారికి తెలీదు: కోమటిరెడ్డి

    • హడావుడిగా కట్టారు కాబట్టే కూలిపోయింది: మంత్రి కోమటిరెడ్డి

  • Aug 31, 2025 18:34 IST

    కమిషన్‌ రిపోర్టుపై రూల్స్‌ పాటించనందునే కోర్టుకు వెళ్లాం: హరీష్‌రావు

    • కోర్టులో వాదనలు ఉన్నాయని ఆదరాబాదరాగా అసెంబ్లీలో నివేదిక పెట్టారు

    • ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే మీ కుట్ర ఏంటో అర్థమైంది: హరీష్‌రావు

    • కేసీఆర్‌కు, నాకు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ 8B కింద నోటీసులు ఇవ్వలేదు: హరీష్‌

    • 8B కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది

    • సభ్యులకు 8B, 8C కింద నోటీసులు ఇవ్వాలని చట్టంలో ఉంది: హరీష్‌రావు

    • గతంలో ఇలాంటి అంశాలపై ఇందర, అద్వానీ కూడా కోర్టుకెళ్లారు: హరీష్‌రావు

  • Aug 31, 2025 18:34 IST

    కాళేశ్వరంపై ఎన్ని రోజులైనా చర్చిద్దాం: హరీష్‌రావు

    • ప్రజలకు నిజాలు తెలియాలి: హరీష్‌రావు

    • నివేదికలో ప్రతి అక్షరానికి సమాధానం ఇస్తా: హరీష్‌రావు

    • కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అంతా పొలిటికల్‌ డ్రామా: హరీష్‌రావు

    • ప్రభుత్వం నడుపుతున్నారా?, సర్కస్‌ కంపెనీ నడుపుతున్నారా?

    • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాపై బురదజల్లేందుకు యత్నం

    • పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ నిష్పాక్షికంగా జరిగిందా?: హరీష్‌రావు

    • కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది: హరీష్‌రావు

    • చట్టాన్ని తుంగలోతొక్కి ఏకపక్షంగా కమిషన్‌ నివేదిక ఇచ్చింది: హరీష్‌రావు

    • పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక నిలబడదు: హరీష్‌రావు

  • Aug 31, 2025 18:34 IST

    CWC అనుమతులు రాకముందే పనులు మొదలుపెట్టారు: ఉత్తమ్‌

    • అనుమతులు రాకముందే కాంట్రాక్టులు అప్పగించారు: ఉత్తమ్‌

    • తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవనే వాదన అబద్ధం: మంత్రి ఉత్తమ్‌

    • ప్రాణహిత-చేవెళ్ల పూర్తిచేసిఉంటే 16 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవి

    • కాళేశ్వరం ఖర్చుతో ప్రాణహిత సహా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యేవి

    • కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనం దుర్వినియోగమైంది: ఉత్తమ్‌

    • ఎంతో పారదర్శకంగా కాళేశ్వరం కమిషన్‌ దర్యాప్తు: మంత్రి ఉత్తమ్‌

    • కాళేశ్వరంపై 660 పేజీల నివేదిక సభ ఎదుట ఉంచాం: మంత్రి ఉత్తమ్‌

    • కాళేశ్వరం తప్పిదాలపై అందరి సూచనల మేరకే చర్యలు: ఉత్తమ్‌

  • Aug 31, 2025 18:34 IST

    మేడిగడ్డ కూలడానికి చాలా కారణాలు ఉన్నాయని NDSA చెప్పింది: ఉత్తమ్‌

    • నిర్మాణం, నాణ్యత లోపాలు ఉన్నాయని NDSA చెప్పింది: మంత్రి ఉత్తమ్‌

    • మీరు కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది: మంత్రి ఉత్తమ్‌

    • మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి ఉత్తమ్‌

    • కాళేశ్వరంపై మాకు కక్ష సాధింపు లేదు: మంత్రి ఉత్తమ్‌

    • BRS వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగింది: మంత్రి ఉత్తమ్‌

    • పీసీ ఘోష్‌ కమిషన్‌ పారదర్శకంగా విచారణ జరిపింది: మంత్రి ఉత్తమ్‌

    • మూడు బ్యారేజీలను కమిషన్‌ పరిశీలించింది: మంత్రి ఉత్తమ్‌

    • కేసీఆర్‌, హరీష్‌రావు, ఈటలను కమిషన్‌ ప్రశ్నించింది: మంత్రి ఉత్తమ్‌

    • మాకు కక్ష సాధింపు లేదు.. నిజం తెలియాలన్నదే మా ఉద్దేశం: ఉత్తమ్‌

    • చేసింది చాలదన్నట్లు కమిషన్‌పైనా BRS విమర్శలు: మంత్రి ఉత్తమ్‌

    • పీసీ ఘోష్‌ కమిషన్‌ను కాంగ్రెస్‌ కమిషన్‌ అంటూ విమర్శించారు

    • కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని కోర్టుకు కూడా వెళ్లారు

    • నిజాలను ఎవరు దాచిపెడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి: ఉత్తమ్‌

    • కాళేశ్వరం తప్పిదాలకు కేసీఆర్‌దే పూర్తి బాధ్యత అని కమిషన్‌ తేల్చింది: ఉత్తమ్‌

  • Aug 31, 2025 18:34 IST

    కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరం: ఉత్తమ్‌

    • 2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ ఆరు పిల్లర్లు కూలాయి: మంత్రి ఉత్తమ్

    • కాళేశ్వరం ద్వారా ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌ చేశారు: ఉత్తమ్

    • అందులో 30 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వదిలేశారు: మంత్రి ఉత్తమ్‌

    • రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుతో ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే ఉపయోగం

    • ఏడాదికి సగటున 20 టీఎంసీలు మాత్రమే ఉపయోగపడ్డాయి: ఉత్తమ్‌

    • లక్ష కోట్లు ఖర్చుపెట్టి కొత్తగా రెండు లక్షల ఎకరాలకూ నీరివ్వలేదు: ఉత్తమ్‌

    • రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు ఆరేళ్లలోనే కూలిపోయింది: మంత్రి ఉత్తమ్‌

    • బ్యారేజ్‌ కట్టి డ్యామ్‌లా వినియోగించడం వల్లే మేడిగడ్డ కూలింది: ఉత్తమ్‌

    • కెపాసిటీకి మించి స్టోరేజ్‌ చేయడం వల్లే డ్యామేజ్‌ జరిగింది: మంత్రి ఉత్తమ్

    • అధికారులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు: మంత్రి ఉత్తమ్

    • కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది: ఉత్తమ్

    • మేము కాళేశ్వరం వినియోగించకపోయినా రికార్డుస్థాయి పంట పండింది: ఉత్తమ్

  • Aug 31, 2025 17:16 IST

    కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87,449 కోట్ల ఖర్చు: మంత్రి ఉత్తమ్‌

    • నిరుపయోగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం: మంత్రి ఉత్తమ్‌

    • ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ కూలింది: ఉత్తమ్‌

    • 20 నెలల నుంచి ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం బాధాకరం: మంత్రి ఉత్తమ్‌

    • అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులు మొదలుపెట్టారు: ఉత్తమ్‌

    • తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు: మంత్రి ఉత్తమ్‌

    • ప్రాణహిత-చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం: మంత్రి ఉత్తమ్‌

    • ప్రాణహిత-చేవెళ్లపై 2014 నాటికే రూ.11,600 కోట్ల ఖర్చు: ఉత్తమ్‌

    • మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు సరికాదని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పింది: మంత్రి ఉత్తమ్‌

    • వాప్కోస్‌ రిపోర్టు రావడానికి ముందే మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్ణయం: మంత్రి ఉత్తమ్‌

    • సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు: మంత్రి ఉత్తమ్‌

    • కేబినెట్‌ అనుమతి లేకుండానే ప్రాజెక్టుపై ముందుకెళ్లారు: ఉత్తమ్‌

  • Aug 31, 2025 17:16 IST

    కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ

    • చర్చ ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌

    • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై లఘుచర్చ

    • సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం: నివేదిక

    • భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదు: నివేదిక

    • కాళేశ్వరం డిజైన్‌, నిర్మాణ నాణ్యత లోపాలు: నివేదిక

    • కాళేశ్వరం పనుల పర్యవేక్షణలో లోపాలు: నివేదిక

  • Aug 31, 2025 16:38 IST

    అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై కాసేపట్లో చర్చ

    • చర్చ ప్రారంభించనున్న మంత్రి ఉత్తమ్‌

    • అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన BRS ఎమ్మెల్యేలు

    • కాళేశ్వరంపై ప్రెజెంటేషన్‌కు అనుమతి కోరిన BRS

  • Aug 31, 2025 16:19 IST

    కాళేశ్వరం కమిషన్‌ నివేదిక..

    • తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

    • కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ

  • Aug 31, 2025 15:56 IST

    రేపు గవర్నర్ దగ్గరకు వెళ్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

    • అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

    • రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతున్నాం.. ఇవ్వడం లేదు

    • గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

    • స్థానిక ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తాం

    • న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకునే ఈ నిర్ణయానికి వచ్చాం

    • బలహీనవర్గాల మేధావులు మా ప్రయత్నాన్ని గుర్తించాలి: పొన్నం

    • సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

    • బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం: పొన్నం

  • Aug 31, 2025 12:53 IST

    మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇబ్బందులు లేవు: శ్రీధర్‌బాబు

    • SDF, TUFIDC నిధులు అవసరం ఉంటే ఇస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

  • Aug 31, 2025 12:45 IST

    బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ ను కలవాలని ప్రభుత్వ నిర్ణయం

    • మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో గవర్నర్ ను కలువనున్న అఖిల పక్ష సభ్యులు

    • గవర్నర్ అపాయింట్ మెంట్ కోరనున్న ప్రభుత్వం

    • 50శాతం బీసీ రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తేసే పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలుపాలని కోరనున్న సభ్యులు..

  • Aug 31, 2025 12:44 IST

    తెలంగాణలో మరో కొత్త మున్సిపాలిటీ కోసం అసెంబ్లీ బిల్లు

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ కోసం కార్యాచరణ

    • ఇంద్రేశం మున్సిపాలిటీ ఏర్పాటు కోసం బిల్లు

  • Aug 31, 2025 12:40 IST

    మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులివ్వడం లేదు: హరీష్‌రావు

    • నిధులివ్వకపోతే మున్సిపాలిటీలు ఎలా నడుస్తాయి?: హరీష్‌రావు

    • కొత్త మున్సిపాలిటీలు నియమిస్తున్నారు.. సిబ్బందిని నియమిస్తున్నారా?

    • మున్సిపాలిటీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లే లేరు: హరీష్‌రావు

    • మున్సిపాలిటీల్లో కమిషనర్లు, సిబ్బంది లేరు: హరీష్‌రావు

    • ఆనాడు LRS ఉచితం అన్నారు.. ఇప్పుడేమో డబ్బు వసూలు చేస్తున్నారు

    • ప్రజలు నో LRS.. నో కాంగ్రెస్ అంటున్నారు: హరీష్‌రావు

    • LRS నుంచి ఎంత ఆదాయం వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి: హరీష్‌రావు

  • Aug 31, 2025 12:28 IST

    మూడు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం

    • పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

    • అల్లోపతిక్ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ

  • Aug 31, 2025 12:08 IST

    articleText

  • Aug 31, 2025 11:59 IST

    బీసీ బిల్లుపై చిత్తశుద్ధితో పోరాడాలి: కూనంనేని సాంబశివరావు

    • బీసీ బిల్లుపై చిత్తశుద్ధితో పోరాడాలి: కూనంనేని సాంబశివరావు

    • బిల్లుకు మద్దతిస్తామంటున్నారు.. కానీ కలిసి పోరాడుదామని

  • Aug 31, 2025 11:39 IST

    మేం పాజిటివ్‌గా వెళ్తుంటే.. BRS నెగిటివ్‌గా ఆలోచన చేస్తోంది: శ్రీధర్‌బాబు

    • నెగిటివ్ ఆలోచన చేసే BRS ప్రతిపక్షంలో ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు

    • అదే కొనసాగిస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు: మంత్రి శ్రీధర్‌బాబు

    • సభను ఎన్నిరోజులైనా నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: శ్రీధర్‌బాబు

  • Aug 31, 2025 11:32 IST

    కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

    • పార్టీ పేరు మార్చి తెలంగాణతో బంధం తెంచుకున్నారు

    • తెలంగాణ సంపదను కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టారు

    • పంజాబ్‌లో తెలంగాణ సొమ్మును పంచారు: ఆది శ్రీనివాస్

    • మహారాష్ట్రలో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు: ఆది శ్రీనివాస్

  • Aug 31, 2025 11:31 IST

    42శాతం రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్‌లో ఎందుకు లేవనెత్తడం లేదు?: KTR

    • కులగణన శాస్త్రీయంగా చేయాలని చెప్పాం: కేటీఆర్

    • మేం చేసిన ఇంటింటి సర్వేలో బలహీనవర్గాల సంఖ్య 52శాతం ఉంటే..

    • మీ సర్వేలో 6శాతం ఎలా తగ్గింది: కేటీఆర్

    • మేం ముగ్గురం పాల్గొనకపోతే 6శాతం తగ్గుతుందా?: కేటీఆర్

  • Aug 31, 2025 11:20 IST

    పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నాం: కేటీఆర్

    • పంచాయతీరాజ్‌ బిల్లులో రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు లేవు

    • బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోంది: కేటీఆర్

    • 50శాతం సీలింగ్ తీసేలా రాజ్యాంగ సవరణ చేయాలి: కేటీఆర్

    • బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి

    • చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశాం: కేటీఆర్

  • Aug 31, 2025 11:20 IST

    పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నాం: కేటీఆర్

    • పంచాయతీరాజ్‌ బిల్లులో రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు లేవు

    • గతంలో యూపీఏ ప్రభుత్వంలో మేం భాగస్వాములుగా ఉన్నాం

    • ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేసీఆర్ సూచించారు: కేటీఆర్

    • బీసీలను మా పార్టీ స్పీకర్‌గా, కౌన్సిల్ చైర్మన్‌గా చేసింది: కేటీఆర్

    • మొదటి అడ్వొకేట్ జనరల్ బీసీగా కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్

  • Aug 31, 2025 11:19 IST

    మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్..

    • కమిషన్ రిపోర్ట్ ను హౌస్ లో ఫ్లోర్ లీడర్ లకు హార్డ్ కాపీ ఇచ్చాం..

    • మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీనే ఇచ్చాం..

    • సాయంత్రం నాలుగు గంటలకు కాళేశ్వరం పై చర్చ ఉంటుంది.

    • ఎంత ఆలస్యం అయినా ఈ రోజు సభలో కాళేశ్వరం పై సంపూర్ణ చర్చ జరుగుతుంది

    • తదుపరి చర్యల పై ప్రజాస్వామ్యబద్దంగా వెళతాం

  • Aug 31, 2025 11:07 IST

    పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క

    • బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

    • బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చాం: సీతక్క

  • Aug 31, 2025 11:04 IST

    పంచాయతీ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

  • Aug 31, 2025 10:58 IST

    బీసీల పక్షపాతిగా రాహుల్‌గాంధీ ఉన్నారు: ప్రభుతవ్ విప్ ఆది శ్రీనివాస్

  • Aug 31, 2025 10:33 IST

    9వ షెడ్యూల్‌లో మార్పులు కేంద్రం చేయాలి: మంత్రి శ్రీధర్‌బాబు

    • కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏది?: మంత్రి శ్రీధర్‌బాబు

    • మా పరిధిలో వందశాతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: శ్రీధర్‌బాబు

    • బిల్లు రావడానికి పదేళ్లు పట్టాలన్న ఆలోచనతో BRS ఉన్నట్లుంది: శ్రీధర్‌బాబు

  • Aug 31, 2025 10:22 IST

    మీ చేతులో ఉన్న అధికారాన్ని పంచి పెట్టడానికి మీకు ఉన్న అభ్యతరం ఏంటి..?: ఎమ్మెల్యే శంకర్

    • తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చక ప్రజలకి జరిగిన మేలు ఏంటి..?

    • బీసీలలో ప్రభుత్వానికి నమ్మకస్తులు లేరా..

    • మీ మంత్రి వర్గం, కార్పొరేషన్ చైర్మన్ లలో ఎంత మంది బీసీ లకి ఇచ్చారు..?

    • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ కార్పొరేషన్ లు కలకలాడే.. ఇప్పుడు తలాలు వేసుకునే పరిస్థితి..

    • మంత్రి వర్గానికి బీసీ లు పనికి రారా..కార్పొరేషన్ చైర్మన్ లకి కూడా పనికి రారా..

    • బీసీ లు ఓట్లు వేయడానికి , కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికే పనికి వస్తారా…

  • Aug 31, 2025 10:19 IST

    కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22నెలలైంది: బీజేపీ నేత పాయల్ శంకర్

    • కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారని బీసీలంతా ఆశపడ్డారు: పాయల్ శంకర్

    • కేబినెట్‌లో, మీరిచ్చిన కార్పొరేషన్లలో బీసీల సంఖ్య ఎంత?: పాయల్ శంకర్

    • బీసీల్లో సమర్థులు లేరు? ప్రభుత్వం గుండెపై చేయివేసుకుని చెప్పాలి: పాయల్ శంకర్

    • ఏడాదికి రూ.20వేల కోట్లు బీసీలకు ఇస్తామన్నారు.. ఏమైంది: పాయల్ శంకర్

  • Aug 31, 2025 10:12 IST

    42శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు: పాయల్ శంకర్

    • రిజర్వేషన్లపై అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి: పాయల్ శంకర్

    • కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై సభలో చర్చ జరగాలి: పాయల్ శంకర్

  • Aug 31, 2025 10:01 IST

    మీ కేబినెట్‌లో 42శాతం బీసీ మంత్రులున్నారా?: గంగుల కమలాకర్

    • బడ్జెట్‌లో బీసీలకు రూ.20వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా?: గంగుల

  • Aug 31, 2025 09:56 IST

    BRS బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోరుకుంది: గంగుల కమలాకర్

    • ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్ట్ డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పింది..

    • తమిళనాడు, బీహార్ వెళ్లి నేను అధ్యయనం చేశాను

    • కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారమే డెడికేషన్ కమిషన్ వేయాలి

    • కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ యాక్ట్ ప్రకారం భూసాని కమిషన్ వేయలేదు

    • కాబట్టి భూసాని కమిషన్ నివేదిక చెల్లదు.

    • తమిళనాడులో జయలలిత ఢిల్లీకి వెళ్లి కోరడంతో 9వ షెడ్యూల్ లో చేర్చారు..

    • పార్లమెంట్ లో పెట్టీ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42శాతం రిజర్వేషన్ కు రక్షణ ఉంటుంది

    • జీవో ద్వారా ఇస్తే ఇది న్యాయ స్థానంలో నిలువదు.

    • మీ కేబినెట్ లో 42శాతం బీసీ మంత్రులు ఉన్నారా?

    • బడ్జెట్ లో బీసీలకు 20 వేల కోట్లు ఇస్తాం అన్నారు..ఇవ్వలేదు..

  • Aug 31, 2025 09:52 IST

    మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపింది: రేవంత్

    • గంగుల అభినందిస్తారని నాకు తెలుసు.. కానీ ఆయన వెనకున్నవారు ఒత్తిడి తెస్తున్నారు

    • గతంలో BRS తెచ్చిన రెండు చట్టాలు గుదిబండగా మారాయి: రేవంత్‌రెడ్డి

    • అడ్డంకులు తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపాం: రేవంత్‌రెడ్డి

    • ప్రస్తుత గవర్నర్, గత సీఎం మధ్య సాన్నిహిత్యంతో బిల్లులు ఆగాయి

    • తెర వెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపేలా చేశారు: రేవంత్‌రెడ్డి

    • కేంద్రంపై ఒత్తిడి తేవాలని జంతర్ మంతర్‌ దగ్గర ధర్నా చేశాం: రేవంత్‌రెడ్డి

    • బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఐదు సార్లు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 31, 2025 09:51 IST

    బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి BRSకు లేదు: రేవంత్‌

    • బీసీ బిల్లుపై గంగుల కమలాకర్ సంతోషంగా ఉన్నారు: రేవంత్‌రెడ్డి

    • రిజర్వేషన్లపై కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు బాధతో ఉన్నారు

    • కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం: రేవంత్‌రెడ్డి

    • కేసీఆర్ సభకు రారు.. వచ్చినవారు ఇలా ఉన్నారు: రేవంత్‌రెడ్డి

    • మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు: రేవంత్‌రెడ్డి

    • ఆరోపణలు చేయకుండా సూచనలు చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 31, 2025 09:44 IST

    రిజర్వేషన్ల పెంపు కోసం ఆర్డినెన్స్ తెచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి

    • హరీష్ రావుకు గవర్నర్ తో మిత్రత్వం ఉంది

    • తెరవెనుక లాబీయింగ్ చేసి ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపించారు

    • ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో పడింది

  • Aug 31, 2025 09:41 IST

    బలహీన వర్గాలకు ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గొద్దు అనుకున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

    • ఆరునూరైనా చెప్పింది చేయాలి అనుకున్నాం

    • అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా మాట నిలబెట్టుకోవాలని అనుకున్నాం

    • ఇతర రాష్ట్రాల్లో ఎదుర్కున్న సమస్యలు ఇక్కడ ఎదురుకావొద్దని అనుకున్నాం

    • స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం

    • బిల్లులను గవర్నర్ కు పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపారు

    • 5 నెలలుగా రాష్ట్రపతి వద్దే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి

    • సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలని కోర్టు చెప్పింది

    • రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని కేసీఆర్ చట్టం తెచ్చారు

    • కేసీఆర్ తెచ్చిన చట్టాలు గుదిబండగా మారాయి

  • Aug 31, 2025 09:40 IST

    కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టులోని కీలక అంశాలు

    • సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం

    • 3 ప్రాజెక్టుల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి లోపాలు..

    • తప్పిదాలున్నాయని కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

    • నిపుణుల కమిటీ సూచలను కూడా పట్టించుకోలేదు

    • భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని నివేదిక

    • డిజైన్‌, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టు

    • అన్నారం బ్యారేజ్‌లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయి

    • పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయి

    • భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదని పీసీ ఘోష్‌ నివేదిక

    • ప్రాజెక్టు CWC అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదిక

  • Aug 31, 2025 09:38 IST

    బీసీలకు అవమానం కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు: సీఎం

    • బీసీ కమిషన్ మొత్తం వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చింది: రేవంత్

    • బీసీల్లో అపోహలు సృష్టించేలా గంగుల మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్

    • బీసీ బిల్లుపై గంగులకు పూర్తి అవగాహన ఉందని భావిస్తున్నా

    • పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా గంగుల తప్పుదోవ పట్టిస్తున్నారు

  • Aug 31, 2025 09:36 IST

    పార్టీ ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారా?: సీఎం రేవంత్

    • ఈరోజు రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెడుతున్న బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారా?

    • గంగుల కమలాకర్ చిన్న స్థాయికి పైకి వచ్చారు.

    • అతను బీసీ బిడ్డ.. అలాంటప్పుడు ఈ బిల్లుపై ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు?

    • బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చెప్పిన విధానంలో ఆయన మాట్లాడుతున్నారేమో మాకు తెలీదు

  • Aug 31, 2025 09:33 IST

    స్పీకర్ మా హక్కులను కాపాడండి: గంగుల

    • మీరు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.

    • వ్యక్తిగతంగా మంత్రులను మాట్లాడకుండా ఉండమనండి

    • మీరు అలా మాట్లాడే అవకాశం ఇవ్వకండి అంటూ గంగులపై స్పీకర్ ఫైర్

  • Aug 31, 2025 09:31 IST

    అసెంబ్లీలో మంత్రి పొన్నం Vs గంగుల..

    • బీసీ కమిషన్ పై మంత్రి పొన్నంకు అవగాహనా లేదన్న గంగుల .

    • గంగుల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం సీరియస్.

    • గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు.

  • Aug 31, 2025 09:19 IST

    సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్‌లు చెల్లవు.. అందుకే బిల్లు తెచ్చాం: శ్రీధర్‌బాబు

    • సెషన్స్‌లో ఉన్నప్పుడు బిల్లు రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది

    • మున్సిపల్ చట్టం 2019 నిబంధనలపై చర్చిస్తున్నాం: మంత్రి శ్రీధర్‌బాబు

    • బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం: శ్రీధర్‌బాబు

    • బలహీనవర్గాలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

    • బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలి: మంత్రి శ్రీధర్‌బాబు

  • Aug 31, 2025 09:18 IST

    సభ ముందుకు మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు

  • Aug 31, 2025 09:17 IST

    పంచాయత్ రాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సర్కార్

  • Aug 31, 2025 09:16 IST

    రెండోరోజు కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ

    • దివంగత మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం

    • రాజిరెడ్డి, మదన్‌లాల్‌కు సంతాపం తెలిపిన అసెంబ్లీ

    • పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్‌బాబు

    • కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను టేబుల్ చేసిన ప్రభుత్వం

    • కాళేశ్వరం రిపోర్ట్‌ను సభ్యులకు అందజేసిన అసెంబ్లీ సిబ్బంది

    • 665 పేజీల రిపోర్ట్‌ను పెన్‌డ్రైవ్‌ ద్వారా సభ్యులకు అందజేత

  • Aug 31, 2025 08:45 IST

    నాయిని రాజెందర్ రెడ్డి, ఎమ్మెల్యే

    • కాళేశ్వరంలో ఎవరి దోపిడీ ఎంత అనేది ప్రజలకు తెలియాలి

    • తమ అవినీతి బయటకు వస్తుందనే యూరియా అంశాన్ని తెరపైకి తెస్తున్నారు

    • యూరియా కొంత కొరత ఉంది

    • బాలు నాయక్ అనే రైతు 8 యూరియా బస్తాలు తీసుకున్నాడు. అయినా బాలు నాయక్ కు యూరియా అందలేదని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది

    • యూరియా పై చర్చ పెడదాం. యూరియా ఎక్కడ నుంచి రావాలో బీఆర్ఎస్ కు తెలియదా?

  • Aug 31, 2025 08:45 IST

    అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్

    • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వరీ అడిగాం

    • ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లతో విచారణ చేపిస్తాం

    • కేసీఆర్ సభకు రావాలి కాళేశ్వరంపై మాట్లాడాలి

  • Aug 31, 2025 08:31 IST

    కాళేశ్వరం రిపోర్ట్ ను సభ్యులకు అందజేసిన అసెంబ్లీ సిబ్బంది

    • 665 పేజీల రిపోర్ట్ ను పెన్ డ్రైవ్ ద్వారా సభ్యులకు పంపిన ప్రభుత్వం

  • Aug 31, 2025 08:26 IST

    నేడు వాడిడేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ

    • సభలో కమిషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్

    • సభలో పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్

    • బీసీ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • ఉ.9:30కు కేరళ వెళ్లి సా.3:40కి తిరిగి అసెంబ్లీకి సీఎం రేవంత్