Home » Karnataka
ఏడాదికోసారి మాత్రమే తెరుచుకునే హాసనాంబ దేవి ఆలయం అంగరంగవైభవంగా భక్తజనం నినాదాల మధ్యన గురువారం తెరిచారు. హాసన్ జిల్లా ప్రజలు ఆదిదేవతగా కొలిచే హాసనాంబ ఆలయం మధ్యాహ్నం 12.19గంటలకు శాస్త్రోక్తంగా గర్భగుడి తలుపులు తెరిచారు.
భార్యను చంపిన భర్త రెండు రోజులు మృతదేహాన్ని దగ్గరే ఉంచుకున్నారు. తరలించే ప్రయత్నం ఫలించక పరారీ అయ్యారు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా కమలదిన్ని గ్రామంలో ఘటన గురువారం వెలుగు చూసింది.
ఆ ఇంట్లో ఆకాశ్‌తో పాటు అతడి తల్లి మాత్రమే ఉంటోంది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు సాక్షి పుట్టింటికి వెళ్లిందని అబద్ధం చెప్పాడు. రెండు రోజుల పాటు భార్య శవాన్ని ఉంచిన బెడ్‌పైనే పడుకున్నాడు.
చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ తాజాగా జరిపిన సోదాల్లో రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. దీంతో మొత్తం 150 కోట్లకు..
కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు నెలకు వేతనంతో కూడిన ఒక రోజు సెలవు మంజూరు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నగర సమీపం యక్లాస్‌పూర్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భారీ నీటి గుంతలో రెండు మొసళ్లు మరో సారి ప్రత్యక్షం కావడం స్థానికల్లో కలకలం రేపింది. యక్లాస్‌పూర్ గ్రామ శివారుకు వెళ్లే ఎన్‌ఆర్‌బీసీ కాలువ నీరు సర్వే నంబరు 347 పొలంలో భారీ గుంతలోకి వచ్చి చేరుతుండడంతో మొసళ్లు వచ్చి చేరాయి.
ఎంతో అభివృద్ధి చెందిన నేటికాలంలో కూడా మహిళలు, యువతులపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంగిక , వరకట్న వేధింపులకు ఆడవాళ్లు గురవుతున్నారు. మహిళల కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా..దాడులు, వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది..
తుళునాడు ప్రాంతంలోని ఆధ్యాత్మిక సంప్రదాయంకు అనుగుణంగా విడుదలైన కాంతార చాప్టర్-1 దేశవిదేశాలలో సంచలనం సృష్టిస్తోంది. కాంతార పేరుతోనే సైకిల్‌ప్యూర్ అగరబత్తిను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
సాంస్కృతిక నగరి మైసూరులో పట్టపగలు దారుణహత్య జరిగింది. దసరా ఉత్సవాలతో సందడిగా సాగిన మైసూరు ఇప్పుడే ప్రశాంత వాతావరణ పరిస్థితికి వస్తున్న తరుణంలోనే హత్య జరిగింది.
తిరుపతిలో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు పాల్పడేది కర్ణాటక గ్యాంగ్ అని పోలీసులు గుర్తించారు. వీరు నగరాన్ని షెల్టర్ జోన్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌ల నుంచి ద్విచక్ర వాహనాలు చోరీ చేయడం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మహిళలు, వృద్ధుల బ్యాగులు ఎత్తుకెళ్లి ఆభరణాలు, నగదు కొట్టేస్తున్నారని తెలిసింది.